Yamakoopam (Telugu) Yamakoopam (Telugu)

Yamakoopam (Telugu‪)‬

A Telugu translation of Aleksandr Kuprin's Yama the Pit

    • 4,49 €
    • 4,49 €

Beschreibung des Verlags

యమకూపం - అనుసృజన: రెంటాల గోపాలకృష్ణ, సంపాదకత్వం, కల్పనా రెంటాల; రష్యన్ మూలం : యమా ది  పిట, రచయిత : అలెగ్జాండర్ కుప్రిన్. అనేక భాషల్లోకి అనువాదమైన 'యమా ది పిట్' నవలకు 'యమకూపం' పేరిట రెంటాల చేసిన తెలుగు అనువాదం మొదటగా 1960లో వచ్చింది. గొప్ప నవలల్ని చదవాలనుకునేవాళ్ళు, తప్పనిసరిగా రష్యన్, ఫ్రెంచి, జర్మనీ నవలల్ని చదవాల్సిందేనంటాడు ప్రఖ్యాత ఆంగ్ల నవలా రచయిత ఈ.యం. ఫార్స్టర్ తన 'ఆస్పెక్ట్స్ ఆఫ్ ది నావెల్'లో! ఆ మాట చెబుతున్నప్పుడు ఫార్స్టర్ దృష్టిలో ఉంచుకున్న రష్యన్ మహా నవలా రచయితల జాబితాలో టాల్స్టాయ్, దోస్తోఎవ్స్కి, తుర్గెనేవ్, గోర్కీలతో పాటుగా తప్పకుండా కుప్రిన్ కూడా ఉండే ఉంటాడు. కుప్రిన్ను అంత గొప్ప నవలాకారుల సరసన కూర్చోపెట్టిన నవల - 'యమా ది పిట్'. తెలుగు అనువాదంలో రెంటాల గోపాలకృష్ణ గారు దానికి పెట్టిన అద్భుతమైన పేరు - 'యమకూపం'. 


'ఆన్కోర్'  అనేది ఫ్రెంచ్ మాట. ఒపెరా లాంటి సంగీత ప్రదర్శనలో ప్రదర్శన ముగిశాక ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య కళాకారులు లోపలకు నిష్క్రమిస్తారు. ప్రేక్షకుల విశేష ఆదరణతో వేదిక మీదకు మళ్ళీ వచ్చి, పాడతారు. అలా రెండోసారి వేదిక మీదకు రావడాన్ని 'ఆన్కోర్' అంటారు. తెలుగు సాహిత్యంలోని ఆణిముత్యాల లాంటి పుస్తకాలు ఇలా పునఃప్రవేశం చేయడానికి ''ఆన్కోర్'' మంచిపదం అని 'సారంగ బుక్స్' నిర్ణయించడం వల్ల మా క్లాసిక్స్ రీ-ప్రింట్కు ఆ పదాన్ని ఎంచుకున్నాం. 'సారంగ ఆన్కోర్' సిరీస్లో తొలి కానుక - ఈ 'యమకూపం'.

GENRE
Belletristik und Literatur
ERSCHIENEN
2012
13. September
SPRACHE
TE
Telugu-Sprache
UMFANG
286
Seiten
VERLAG
Saaranga Publishers
GRÖSSE
496,7
 kB