Satyanveshana
-
- 2,99 €
-
- 2,99 €
Beschreibung des Verlags
దశాబ్దాలుగా ఎన్నో మంచి కథలు రాసి, డజనుకి పైగా పుస్తకాలు ప్రచురించబడిన పరిణిత రచయిత సత్యంగారి రచనాశైలి గురించి నేను ప్రత్యేకంగా ప్రస్తావించడమంటే అది సూర్యుడికి దివిటీ పట్టే ప్రయత్నమే. గొల్లపూడిగారు ఓ సందర్భంలో అన్నారు- "సత్యం గారి రచనలు బావుంటాయనటం సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్న నిత్యసత్యాన్ని పునరుద్ఘాటించటమే!" అని.
సత్యంగారి గురించి ఆయన రాసిన ఒక వ్యాసాన్ని అభిమానిస్తూ ఒక వ్యక్తి రాసిన మాటలు 'పేరులో సత్యం, మాటలో సత్యం, మనసులో సత్యం' అన్న అక్షర సత్యాల్ని చూశాక 'ఇంక నేనెందుకూ రాయడం, ఆ ఆరు మాటలు సరిపోవూ, ఆయన గురించి చెప్పడానికి?' అనిపించింది. ఆయన చేస్తున్న సత్యాన్వేషణ ఈ పుస్తకంతో మొదలవలేదు, ఈ చిన్ని వ్యాసాలకు మాత్రమే పరిమితం కాలేదు. అన్వేషణ ఆయనకున్న సహజతత్వం. 'ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ' అన్న చలంగారి మాటలు సత్యంగారికి కూడా వర్తిస్తాయి. ప్రపంచంలో జరిగే అనార్ధాలను ఎన్నింటినో చూస్తూ, అనుభవిస్తూ, వాటిని భరించలేక, ప్రపంచమంతా ఇంకోలా వుంటే ఎంతబాగుండునో అంటూ సత్యంగారి కలంలోంచి సిరాక్షరాలు కాగితం మీద మనముందు కళ్ళెగరేసుకు చూస్తూ గేలి చేస్తుంటాయి. ఆ అనార్థాలకి మనమెంత దోహదం చేస్తున్నామో అని కన్ను గీటుతూ సూది పెట్టి పొడుస్తున్నట్లు పొడుస్తాయి ఆయన రచనలు - కథలు, వ్యాసాల రూపాల్లో.