నిజమే కల అయితే
-
- £3.49
-
- £3.49
Publisher Description
మనిషి చనిపోయాక ఏమవుతాడు? పునర్జన్మ అనేది నిజంగా వుందా? అనే ప్రశ్నలు, కొంచెం ఆలోచించే ప్రతివాళ్ళకీ, జీవితంలో రకరకాల సందర్భాల్లో ఆసన్నమవుతాయి. అందులోనూ ఎవరికి కావలసిన మతాలు నమ్మకాలు, ప్రపంచం అంతటా ఎవరికి వారు, ఏర్పరచుకున్నాక ఈ సమస్య ఇంకా క్లిష్టమైంది. ఇలాటి క్లిష్టమైన విషయం మీద ఒక పరిశీలనాత్మకమైన, శాస్త్రీయ నవల వ్రాయాలని, ఎన్నో దశాబ్దాలుగా కలలు కంటున్నాను. మూడేళ్ళ నించీ, కావలసిన సమాచారం ఎన్నో పుస్తకాల ద్వారానూ, శాస్త్రీయ వ్యాసాల ద్వారానూ, కొంతమంది సైకియాట్రిస్టులు, పారాసైకాలజిస్టులు, హిప్నోటిష్టులతో కబుర్ల ద్వారానూ, మధ్యే మధ్యే గూగులమ్మ సహయంతోనూ, ఎంతో సమాచారం సేకరించాను. నా కల నిజమయే అవకాశం అప్పుడు బాగా కనపడింది. ఇక దీని మీదే కూర్చుని, మూడు నెలల్లో ఈ నవల పూర్తిచేశాను. చదివి ఎలా వుందో చెబుతారు కదూ!