యథార్థగీత - శ్రీమత్ భగవద్గీత యథార్థగీత - శ్రీమత్ భగవద్గీత

యథార్థగీత - శ్రీమత్ భగవద్గీ‪త‬

యథార్థగీత - శ్రీమత్ భగవద్గీత - మానవ ధర్మ శాస్త్రం

Publisher Description

5200.....వేలాది సంవత్సరాల తరువాత శ్రీమత్ భగవద్గీతకు శాశ్వత వ్యాఖ్యానము.


---------------------------------------------------------

గురించి యథార్థగీత


శ్రీ కృష్ణుడు అర్జునునికిగీతోపదేశం చేసినప్పుడు అతని అంతర్గత స్పందనలు మరియు మనోభావాలు ఏమిటో? అన్ని అంతర్గత మనోభావాలను మాటలతో చెప్పలేము. కొన్ని నోటితో చెప్పవచ్చును....మరికొన్ని శారీరక భావ భంగిమల ద్వారా తెలుపవచ్చును. మిగిలినవన్నీ క్రియాత్మకమైనవి. వాటిని అనుభవాల ద్వారా సాధకుడు అర్థం చేసుకొనవచ్చును. గీతోపదేశం చేసినప్పుడు కృష్ణుడు ఏ స్థాయిలో ఉన్నాడో, క్రమంగా పయనించి అదే అవస్థకు చేరుకున్న మహాపురుషుడు మాత్రమే గీత యొక్క తత్వాన్ని తెలుసుకొనగలడు. అతను కేవలం గీతలోని శ్లోకాలను చెప్పడమేగాక వాటి భావాలను కూడా  దర్శింపజేస్తాడు.  


ఎందుకంటే, శ్రీ కృష్ణుడు గీతను బోధించినప్పుడు అతని ముందున్న దృశ్యమే వర్తమాన మహాపురుషునికి కూడా కనిపిస్తుంది. అతనికి నిజమైన భావం కనిపిస్తుంది. మనకు అదే తెలియజేస్తాడు. అంతర్గత స్పందనలు మేల్కొల్పుతాడు మరియు వెలుగు బాట వైపు నడిపిస్తాడు.     


---------------------------------------------------------

గురించి రచయిత


పూజనీయులు పరమహంసజీ మహరాజ్ అదే స్థాయిలోని వెలుగు బాట చూపే గురువు, మహాపురుషుడు. వారి వాక్కులు మరియు గీతలోని అంతర్గత స్పందనను గ్రహించుటకు ఇచ్చిన ఆశీర్వచన సంకలనమే ఈ "యథార్థగీత".  


యథార్థగీత రచయిత ఒక ఋషి, వీరికి శిక్షా బుద్ధులేవీలేకున్ననూ సద్గురు కృపాప్రసాదంచేఈశ్వరీయ ఆదేశాలతో సంచాలితులయ్యేవారు. వీరు సాధనా మార్గంలో రచన ఒక అవరోధంగా భావించేవారు, కానీ ఈ గీతా భాష్యానికి భగవంతుని ఆదేశమే నిమిత్తమయ్యింది. భగవంతుడు వీరికి స్వప్న మాధ్యమంలో చెప్పిందేమిటంటే "నీ మనోవృత్తులన్నీశాంతమైపోయాయి, కేవలం గీతా భాష్యాన్ని వ్రాయడమనే ఒకే ఒక చిన్న మనోవృత్తి మిగిలి ఉంది".


అప్పుడు స్వామీజీ ఈ మనోవృత్తిని కూడా సాధన ద్వారా తుడిచివేయాలని ప్రయత్నించారు. కానీ భగవంతుని ఆదేశానికి మూర్త స్వరూపమే ఈ "యథార్థగీత".   భాష్యంలో ఎక్కడైనా తప్పులుంటే భగవంతుడే వాటిని సరిదిద్దేవాడు. స్వాములవారిస్వాంతఃసుఖాయమానమైన ఈ కృతి సర్వాతఃసుఖాయమానమవ్వాలని ఆశిస్తున్నాం.   


శంకరాచార్యులు, మహామండలేశ్వరులు, బ్రాహ్మణ మహాసభ సభ్యులు మరియు నలభై దేశాల నుండి గురువులందరి సమక్షంలో హరిద్వారులో ఈ శతాబ్దపు ఆఖరి కుంభమేళా జరిగిన సందర్భంగా "విశ్వ ధర్మ సంసద్" వారిచే పూజనీయులైన స్వామీజీకి "విశ్వగౌరవ్" బిరుదు ప్రదానం చేయబదింది.


10.04.1998 నాడు ఈ శతాబ్దపు ఆఖరి కుంభమేళాలో మానవ ధర్మ శాస్త్రమైన శ్రీమద్భగవద్గీతను వాస్తవిక రూపంలో విశ్లేషిస్తూ గ్రంధస్తం చేసిన ఈ "యథార్థగీత" కై స్వామీజీకి "భారత్ గౌరవ్" బిరుదు ప్రదానం చేయబదింది.  


విశ్వ ధర్మ పరిషత్తువారువిశ్వమానవ ధర్మశాస్త్రం శ్రీమద్భగవద్గీత యొక్క  భాష్యం "యథార్థగీత"కు పరమపూజ్య విశ్వగౌరవ్పరమహంస్ స్వామీ శ్రీ ఆడగడానంద మహరాజ్ కు ప్రయాగ పావన కుంభమేళా పర్వము తేదీ: 26.01.2001 నాడు "విశ్వగురువు" ఉపాధి ద్వారా సన్మానించడం జరిగింది. 


ఆడియో మరియు శ్రీమద్భగవద్గీత యొక్క వ్యాఖ్యాన గ్రంధం - యథార్థ గీత అన్ని అంతర్జాతీయ (ఇంగ్లీషు, రష్యన్, ఫ్రెంచ్, జర్మన్, స్ప్యానిష్, చైనీస్, ఇటాలియన్, నార్వేయియన్, డచ్, పోర్చుగీస్, అరబిక్, జపనీస్, పర్షియన్, నేపాలీ మరియు ఉర్దు) భాషలలోనూ మరియు భారతీయ భాషలలోనూ (హీందీ, బెంగాలీ, అస్సామీ, గుజరాతీ, మరాఠీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, ఒడియా, సింధీ, సంస్కృతం, పంజాబీ) లభిస్తున్నది.                 


మరిన్ని వివరాల కోసం దర్శించండి:  http://yatharthgeeta.com  


శ్రీ పరమహంస స్వామీ అడగడానందజీ ఆశ్రమ ట్రస్ట్.

GENRE
Religion & Spirituality
RELEASED
2001
1 January
LANGUAGE
TE
Telugu
LENGTH
374
Pages
PUBLISHER
Shri Paramhans Swami Adgadanandji Ashram Trust
SIZE
2.8
MB

More Books by Swami Adgadanand

श्रीमद्भगवद्गीता - यथार्थ गीता - मानव धर्मशास्त्र श्रीमद्भगवद्गीता - यथार्थ गीता - मानव धर्मशास्त्र
1983
ஸ்ரீமத்பகவத் கீதை - யதார்த்த கீதை ஸ்ரீமத்பகவத் கீதை - யதார்த்த கீதை
1997
Yatharth Geeta – Norwegian Yatharth Geeta – Norwegian
2006
Yatharth Geeta - Deutsch Yatharth Geeta - Deutsch
1997
Yatharth Geeta - Portuguese Yatharth Geeta - Portuguese
2009
Yatharth Geeta - French Yatharth Geeta - French
1997

Customers Also Bought

Essence of Instruction (Upadesa Saram) Essence of Instruction (Upadesa Saram)
2014
Karma Yoga Karma Yoga
2011
Mahabharata Comic Book 1 - Vyasa Composes Mahabharata Comic Book 1 - Vyasa Composes
2014