కినిగె పత్రిక డిసెంబరు 2013 Telugu Free
A wonderful Magazine from Kinige.com with latest Telugu writings.
発行者による作品情報
మంచి రచనల్ని అందిద్దామనీ, పుస్తకాల మంచీ చెడ్డలు మాట్లాడుకుందామనీ ఈ పత్రిక మొదలుపెడుతున్నాం. సమీక్షలు, కథలు, అనువాదాలు, ఇంటర్వ్యూలు, కవితలు, మ్యూజింగ్స్, ధారావాహికలూ ఇందులో దినుసులు. ఇవే ఉంటాయని గిరి గీస్తే చాలా బయటే మిగిలిపోవచ్చు. అలా మిగిలిపోయాయని ఎత్తి చూపగలిగే రచనలకూ సాదరాహ్వానం. కినిగె విషయంలో ఎప్పుడూ తరగక నిత్యం పెరుగుతూనే ఉన్న మీ ఆదరణ ఈ పత్రిక విషయంలో కూడా కోరుతున్నాం. ఈ పత్రిక గురించి మీ అభిప్రాయాన్ని editor@kinige.com తో పంచుకోవాల్సిందిగా మనవి.
ఈ నెల సంచికలో అంశాలు:
కనక ప్రసాదు కథ: జీడికి రాజు ఎవరు?
శ్రీవల్లీ రాధిక కథ: హేలగా… ఆనంద డోలగా…
మెహెర్ కథ: పర్యవేక్షణ
బివివి ప్రసాద్ కవిత: నీరెండ
భగవంతం కవిత: బాటసారీ నీ దారి పేరు సెలయేరు
శ్రీరమణతో ముఖాముఖి
మధురాంతకం నరేంద్రతో ముఖాముఖి
పూర్ణిమ తమ్మిరెడ్డి హిందీ నుంచి అనువదించిన వ్యంగ్య రచన: న్యాయాన్ని ఆశ్రయిస్తే.
సినిమా వెనుక కథ శీర్షికన వెంకట్ సిద్ధారెడ్డి అనువాదం: బ్లో అప్
స్వాతి కుమారి బండ్లమూడి మ్యూజింగ్: ఆవిరి
పుస్తక సమీక్షలు:
పాలపర్తి ఇంద్రాణి “ఱ”
కాశీభట్ల వేణుగోపాల్ “కాలం కథలు”
అయినంపూడి శ్రీలక్ష్మి “మోనోలాగ్ ఆఫ్ ఎ వూండెడ్ హార్ట్”
ఓల్గా “స్వేచ్ఛ”
మధురాంతకం నరేంద్ర “ఆమ్‌స్టర్‌డాంలో అద్భుతం”
రచన కళ పేరిట వి.ఎస్. నయీపాల్ ఇంటర్వ్యూ అనువాదం
రాయదుర్గం విజయలక్ష్మి బుచ్చిబాబుపై వ్యాసం
త్రిపుర అసంకలిత కథ: “నిద్ర రావడం లేదు”
కాఫ్కాపై పరిచయ వ్యాసం: “శిలువ మోసిన రచయిత”
ఇంకా కవిత్వానువాదాలపోటీ, కొత్త పుస్తకాలపై చిరు సమీక్షలు, సాహితీ ముచ్చట్లు.