Satyameva Jayate
-
- ¥550
-
- ¥550
発行者による作品情報
'సత్యమేవ జయతే!" ధారావాహికపై కొందరు పాఠకుల స్పందన
'సత్యంగారి కథలెన్నో చదివాను. కొన్నిట్లో హాస్యం అంతర్లీనంగా తళుక్కుమంటూ వుంటుంది. కొన్నిట్లో అదే ప్రధాన రసంగా అలరిస్తుంది. ఈ నెల ప్రచురించిన 'పురస్కార్లు' కడుపుబ్బ నవ్వించింది. ఇలాటివి ఖండించటానికి హ్యూమరుని మించిన అస్త్రం లేదు" - SP, Houston
'నేను సినీ రచయిత చంద్రబోసుని. సత్యంగారి రచనలంటే నాకు ముందు నుండీ ఇష్టం. 'శాస్త్రశేషం' అనే పదబంధం వినూత్నంగా వుంది. సత్యమేవజయతే శీర్షికలోని ఈ వ్యాసం ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాను. ఆయన కలం నుండి ఇంకా ఎన్నో రచనలు రావాలని ఆశిస్తున్నాను' - చంద్రబోస్
'సత్యంగారి కథలు, వ్యాసాలు సున్నితమైన హాస్యంతో వుండటమే కాక, సమకాలీన సత్యాలని ఆవిష్కరిస్తాయి. మీనించీ ఇంకా ఎన్నో మంచి రచనలు ఆశిస్తూ' - R, Hyderabad
'స్త్రీ శిశు హంతకులకి నరకం చూపించారు ఈ కథలో. ఆ బాపతు మనుషుల ముక్కు పగిలీలా, మొహం మీద గుద్ది చెప్పినా వోపట్టాన మారరు. ఓరి బ్రహ్మ దేవుడా! నీ సృష్టిలో తరవాత బేచిల్లో కాస్త ఇల్లాంటి పుచ్చు మనుషుల్లేకుండా చూడు తండ్రీ!' - JM, United Kingdom
''సత్యమేవ జయతే' వ్యాసాలు చాలా హాస్యభరితంగా వుంటున్నాయి. చదువుతుంటే నాకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది. మీరు కధలలోనే కాకుండా, నిజంగా కూడా ఇలా మాట్లాడే అలవాటు వుంటే, ఇంకనించి మీతో స్నేహం చేసేసి, మిమ్ములని ప్రతిరోజూ కారులో ఆఫీసుకి వెళ్ళేటప్పుడు, ఇంటికివెళ్ళేటప్పుడు, ఫోన్చేసి మాట్లాడుతూ ఉండచ్చుకదా అని. ఏమంటారు?' - BMK, Houston, TX