సున్నతి - బాప్తిస్మము సున్నతి - బాప్తిస్మము

సున్నతి - బాప్తిస్మమ‪ు‬

Descripción editorial

ప్రియపాఠకులారా! ఈ ప్రపంచ చరిత్రలో ఎన్నో మతాలు, సిద్ధాంతాలు ఏర్పరచబడ్డాయి. అయితే వీటిలో నిజదైవము ఏర్పరచినవి ఎన్ని? నిజదైవములోనికి వచ్చుట ఇష్టము లేని అపవాది అను సాతాను ఏర్పరచినవి ఎన్ని? పాత నిబంధన కాలములో నిజదైవము అబ్రాహామునకు ప్రత్యక్షమై సున్నతిని ఒక గుర్తుగాను, ఒడంబడిక గాను ఏర్పరచుట జరిగినట్లుగా ఆదికాండములో మనము చదువగలము. అలాగే పాత నిబంధన కాలములో నిజదైవము మోషేకు తన్నుతాను ప్రత్యక్షపరచుకొని సీనాయి కొండపై పది ఆజ్ఞలను వాటితోబాటు ఆచరించవలసిన నియమములు, కట్టడలు రాజ్యాంగ పరిపాలన న్యాయవిధులు వగైరాలన్నియు ధర్మశాస్త్రమను పేరుతో మోషే చేత వ్రాయించడం జరిగింది. ఈ ధర్మశాస్త్ర గ్రంథములో సున్నతికి ప్రాధాన్యతను ఇస్తూనే హృదయ సంబంధమైన సున్నతిని ఏర్పరచుట జరిగింది. యిర్మీయా 9:25 అంటే నీతిగా జీవించినవారే నిజ దైవ సంబంధులుగా గుర్తించబడుదురని చెప్పబడినది.
ఈ విధముగా కొంతకాలము సున్నతి క్రియ జరిగించింది. నూతన నిబంధన కాలమునకు మూలపురుషులైన బాప్తిస్మమిచ్చు యోహాను యేసుక్రీస్తు ప్రభువునకు కూడా సున్నతి జరిగించారు. అయితే నిజదైవమునకు ప్రతిరూపమైన యేసుక్రీస్తు ప్రభువునకు బాప్తిస్మము యోహాను ద్వారా ఇయ్యబడినది. ఈ బాప్తిస్మమును నూతన నిబంధన కాలములో దైవప్రత్యక్షత ద్వారా యోహాను పొందుట జరిగింది. దానిని అమలుపరచాడు.
దైవవాక్యమును పొందిన క్రీస్తు ప్రభువు చెప్పిన రీతిగా నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను బాప్తిస్మము పొందవలసియున్నది, ఎందుకంటే క్రీస్తుయేసునందు నమ్మకము కలిగి ఆయనయందు విశ్వాసముంచుట అను దానికి ఒక మెట్టుగా మనము గుర్తించాలి. ''నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును.'' ఇది బైబిలు గ్రంథము చెప్పుచున్న నిజము. సున్నతి పొందినను, పొందక పోయినను నమ్మి బాప్తిస్మము పొందుట ముఖ్యమైన విషయము. బాప్తిస్మము పొందిన క్రీస్తు ప్రభువే తాను పొందబోవు బాప్తిస్మమున్నదని లూకా 12:50. కనుక బాప్తిస్మము పొందిన ప్రతి యొక్క విశ్వాసి తాను పొందవలసిన బాప్తిస్మము ఏమిటో ఈ పుస్తకము ద్వారా గ్రహించాలి.
ఈ బాప్తిస్మమును అనేక సంఘములవారు అనేక రీతులుగా పొందుచున్నారు. ఈనాడు ఈ బాప్తిస్మమును ప్రపంచ నలుమూలలా ఉన్న క్రైస్తవులు ప్రమాణము ద్వారా చిలకరింపు ద్వారా నీటి ద్వారా ఆచరించుట జరుగుచున్నది. అయితే బైబిలు గ్రంథము బాప్తిస్మము ఎలా పొందాలో ఖచ్చితమైన వాక్యముల ద్వారా తెలియజేస్తున్నది. కనుక బాప్తిస్మమును పొందినవారు, పొందాలి అనుకొనేవారు ఈ పుస్తకమును చదివి బాప్తిస్మములోని మర్మములను గుర్తించి సరియైన పద్ధతిలో మరల బాప్తిస్మమును పొందుట మంచిదని నా అభిప్రాయము. ఎందుకంటే బాప్తిస్మమును పొందినవారికి పౌలు తన చేతుల ద్వారా బాప్తిస్మమును మరలా ఇచ్చి వారికి పరిశుద్ధాత్మను కూడా ఒసగుట జరిగింది.
కనుక ఈ పుస్తకము ఆమూలాగ్రము క్షుణ్ణముగా చదివి గ్రహించి నమ్మకము కలిగి బాప్తిస్మమును నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను పొందుట మంచిదని ఈ పుస్తకము ద్వారా త్రియేక దేవుని నామములో ప్రతి ఒక్కరిని హెచ్చరించుచున్నాను.

GÉNERO
Religión y espiritualidad
PUBLICADO
2017
28 de julio
IDIOMA
TE
Telugu
EXTENSIÓN
84
Páginas
EDITORIAL
Www.FaithScope.com
VENDEDOR
Vasa Reddy
TAMAÑO
1.5
MB

Más libros de Sekhar Reddy Vasa

జేసునాధుని దివ్య వాక్కులు జేసునాధుని దివ్య వాక్కులు
2020
ఏదెనులోని దైవ ప్రణాళిక ఏదెనులోని దైవ ప్రణాళిక
2017
పండుగలు, ఉత్సవాలు, ఊరేగింపులు, మ్రొక్కుబడులు పండుగలు, ఉత్సవాలు, ఊరేగింపులు, మ్రొక్కుబడులు
2017
మోషే ధర్మశాస్త్రము – క్రీస్తు ధర్మశాస్త్రము (Telugu) మోషే ధర్మశాస్త్రము – క్రీస్తు ధర్మశాస్త్రము (Telugu)
2017
ఏడు సంఖ్యలోని సర్వ సంపూర్ణత ఏడు సంఖ్యలోని సర్వ సంపూర్ణత
2017
కీర్తనలు కీర్తనలు
2017