జేసునాధుని దివ్య వాక్కులు జేసునాధుని దివ్య వాక్కులు

జేసునాధుని దివ్య వాక్కుల‪ు‬

Publisher Description

సుమారు 2000 సంవత్సరముల క్రితం ఈ లోకములో క్రీస్తు ప్రభువు జన్మించి తన 30 సంవత్సరాల వయస్సులో సువార్తను ప్రబోధించుట జరిగింది. ఈ కార్యక్రమములో భాగముగా ఆయన సుమారు 33 1/2 సంవత్సరాల వయస్సులో ఈ లోక నరకోటికి పాపక్షమాపణను మారుమనస్సు ద్వారా కలిగించుటకు సిలువ బలియాగము చేసాడు. ఈ సందర్భములో ఏడు మాటలు సిలువపై పలుకుట జరిగింది. ఈ మాటలు ఈనాడు అన్ని సంఘములవారు శుభ శుక్రవారము అనగా గుడ్‌ ఫ్రైడే రోజు వివరించుట చేస్తారు. అలాగే క్రీస్తు ప్రభువే స్వయముగా ఈ లోకములో సువార్తను కొనసాగించుచు అనేక వచనాలను బోధించుట జరిగింది. ఆ వచనాల పరమార్థాలే ఈ పుస్తకమునకు పునాది. ఇలాంటి వచనాల సంఖ్య 63 అంతేకాక సిలువపై మాటలు 7 తో కలిపి మొత్తము 70 అంశములుగా ఈ పుస్తకము నందు ప్రభువు కృపతో సిద్ధపరిచాము. ఇలాంటి సమయములో పెంచల్‌ కుమార్‌ మరియు సురేంద్ర కుమార్‌ అను పేరుగల మిత్రులు ఇరువురు ఈ పుస్తకము త్వరగా అచ్చు కావాలి అందరికి అందుబాటులో ఉండాలి అని వారు అనేక మారులు ప్రేరేపింపగా ఈ పుస్తకమును ముందుగా విడుదలకు సిద్ధపరచుట జరిగింది. వారికి మా కృతజ్ఞతలు. ఇందులో వ్రాయబడిన ప్రతి అంశములోను దైవ నిగూఢ సత్యములనకేములున్నవి. కనుక పాఠకులు ఇవన్ని మేము చదివినవే కదా అని విస్మరించక పూర్తిగా చదివి దైవ నిగూఢ సత్యములలోని దైవిక మర్మములు తెలుసుకొని ఆనందించాలని నా ఆకాంక్ష.
క్రీస్తు ప్రభువు బోధలోని వివరణ భావములు బోధకులు అనేక రీతులుగా బోధించి ఉండవచ్చును. ఇందులోని వివరణ ఆదరణకర్తయైన పరిశుద్ధాత్మ యొక్క ఉజ్జీవము తోడ్పాటు వలన ప్రత్యేకతను సంతరించుకొని ఉన్నదని చెప్పుటకు నేను నా ఆనందమును ప్రభువునందు సఫలము చేసుకొంటున్నాను. ప్రభువు కృప ఆయన నిత్య సహాయము ఎల్లప్పుడు మీకు తోడై యుండి నడిపించును గాక!

GENRE
Religion & Spirituality
RELEASED
2020
23 November
LANGUAGE
TE
Telugu
LENGTH
235
Pages
PUBLISHER
Www.FaithScope.com
SELLER
Vasa Reddy
SIZE
1.2
MB
ఏదెనులోని దైవ ప్రణాళిక ఏదెనులోని దైవ ప్రణాళిక
2017
పండుగలు, ఉత్సవాలు, ఊరేగింపులు, మ్రొక్కుబడులు పండుగలు, ఉత్సవాలు, ఊరేగింపులు, మ్రొక్కుబడులు
2017
మోషే ధర్మశాస్త్రము – క్రీస్తు ధర్మశాస్త్రము (Telugu) మోషే ధర్మశాస్త్రము – క్రీస్తు ధర్మశాస్త్రము (Telugu)
2017
ఏడు సంఖ్యలోని సర్వ సంపూర్ణత ఏడు సంఖ్యలోని సర్వ సంపూర్ణత
2017
కీర్తనలు కీర్తనలు
2017
సున్నతి - బాప్తిస్మము సున్నతి - బాప్తిస్మము
2017