మరణము తరువాత మరణము తరువాత

మరణము తరువా‪త‬

నీ మరణానంతరము నీ ఆత్మ ఎక్కడ వుండ బోవుచున్నదో నీకు తెలుసునా?

Publisher Description

ప్రియపాఠకులారా! ఏదైన ఒక గ్రంథము వ్రాయునప్పుడు అనేక వర్ణనలతో గ్రంథకర్త తనయొక్క ప్రతిభను చూపించుట జరుగును. కాని మరణము తరువాత అను అంశము వర్ణనలతో వ్రాయటానికి ఇది చరిత్ర కాదు, కథ కూడా కాదు. భాషా ప్రావీణ్యము తెల్పుటకు ఇది గేయములు వంటిది కాదు. మరణమనేది ఒక నిద్ర. ఈ నిద్రగా వర్ణించబడిన మరణమును, ఆ తరువాత ఆత్మయొక్క చరిత్ర ఎవరైనా మనకు చెప్పిన అది అర్థమగుట బహు ప్రయాసతో కూడినది, ఎందుకంటే మరణానంతర ఆత్మల చరిత్ర బహు రహస్యములతో కూడియున్నది. అందులోను అది ఒక అదృశ్య చరిత్ర. ఈనాడు మనకు కనిపించేదే నమ్మే స్థితిలో మనము లేము.
అయినను బైబిలు గ్రంథము నందు మరణానంతర చరిత్రను బహు స్పష్టముగా మనకు తెలియజేయుచున్నది. ఇందులో వ్రాయబడిన ప్రతి అంశము బైబిలు ఆధారముగా చెప్పుటకు బహు ప్రయాస పడవలసి వచ్చింది, ఎందుకంటే మరణించిన వారి ఆత్మలు ఇలా వుండును లేక అలా వుండును అంటే నమ్మేవారు ఎవరూ వుండరు. కనుక ప్రతి విభాగమునకు బైబిలు గ్రంథములోని వాక్యములను జతపరచి చెప్పుట చేత ఈ పుస్తకము కొంతవరకు సంపూర్ణత్వము పొందినది అని చెప్పుటకు నేను సంతోషిస్తున్నాను.
మన ఇండ్లలో మనతో ఉండి మన పితరులుగా మరణించినవారి ఆత్మలు ఎక్కడ వున్నారు? అన్న ప్రశ్న మనలో ఆతృతను లేపుతుంది. మన మరణానంతరము మనము ఎక్కడ వుంటాము అన్న ఆలోచన మనలో భయముతో కూడిన భీతి మనకు కలుగుతుంది. కాని మన మరణానంతరము ఒక గొప్ప చరిత్ర జరగబోవునని గ్రహించేవారు కొందరే. అలా దాని గూర్చి తెలుసుకోవాలనుకొనే వారికి ఈ పుస్తకము ఒక గొప్ప వరము.

GENRE
Non-Fiction
RELEASED
2017
15 July
LANGUAGE
TE
Telugu
LENGTH
500
Pages
PUBLISHER
Www.FaithScope.com
SELLER
Vasa Reddy
SIZE
4.8
MB
జేసునాధుని దివ్య వాక్కులు జేసునాధుని దివ్య వాక్కులు
2020
ఏదెనులోని దైవ ప్రణాళిక ఏదెనులోని దైవ ప్రణాళిక
2017
పండుగలు, ఉత్సవాలు, ఊరేగింపులు, మ్రొక్కుబడులు పండుగలు, ఉత్సవాలు, ఊరేగింపులు, మ్రొక్కుబడులు
2017
మోషే ధర్మశాస్త్రము – క్రీస్తు ధర్మశాస్త్రము (Telugu) మోషే ధర్మశాస్త్రము – క్రీస్తు ధర్మశాస్త్రము (Telugu)
2017
ఏడు సంఖ్యలోని సర్వ సంపూర్ణత ఏడు సంఖ్యలోని సర్వ సంపూర్ణత
2017
కీర్తనలు కీర్తనలు
2017