యెషయా ప్రవచన రహస్యములు
Publisher Description
ప్రియపాఠకులారా! పాతనిబంధన కాలములోని ప్రవక్తలు అనేక గ్రంథములు వ్రాయుట జరిగింది. ఇందులో ప్రత్యేక గుర్తింపు గలిగిన గ్రంథము ప్రతి ఒక్కరు మరల మరల చదివే గ్రంథము యెషయా వ్రాసిన గ్రంథము. ఈ గ్రంథము చాలా సులభ రీతిగా వ్రాయబడినను అక్కడక్కడ ప్రత్యేక మర్మములను పెంపొందింప చేసాడు. ఉదాహరణకు బాలకులు బాల చేష్టలు చేసి జనులను ఏలడమేమిటో? సర్పబీజము విషనాగు ఎగురు సర్పము ఇవియేగాక మకరము అను పేరుతో తీవ్రసర్పము వంకర సర్పము సముద్ర మార్గమందున్న సర్పము మరియు తూర్పున నుండి రప్పించు క్రూరపక్షి ఇవి ఏమిటో మానవ జ్ఞానమునకు వాని ఊహలకు అందనట్టి జ్ఞానము ఈ పుస్తకములో అనేకములున్నవి. ఈ మర్మములను ప్రతి ఒక్కరు తెలుసుకొనుట మంచిది అన్న ఉద్ధేశ్యముతో ఈ పుస్తకమును వ్రాయుట జరిగినది. కనుక యెషయా గ్రంథమును ఆమూలాగ్రముగ చదివి అర్థము చేసుకోవాలనుకొన్నవారికి ఈ పుస్తకము ఒక గొప్ప అవకాశము. ఇందులో వివరించబడిన అంశములతోబాటు యెషయా గ్రంథమును వరుసగా చదువుచూ - ఆ భాగమునకు వచ్చుసరికి ఈ అంశములను జోడించి చదివిన మరింత ఎక్కువగా నేర్చుకొను అవకాశమున్నది. అంటే మొదట బైబిలు గ్రంథమును తీసుకొని యెషయా గ్రంథములో వాక్యములను చదవాలి. ఈ గ్రంథములో వ్రాసిన అంశము యొక్క రెఫరెన్స్ వచ్చుసరికి ఆ రెఫరెన్స్ చదివి, వెంటనే ఈ పుస్తకములోని అంశము చదివిన యెషయా వ్రాసిన ఉద్ధేశ్యములను బహు ఖచ్చితమైన రీతిలో మనకు సులభముగా అర్ధము అగునని గుర్తించాలి.
ఈ అంశములు వ్రాస్తూ నేను ఎంతగానో ఆనందించాను. మీరు కూడా చదివి తమ జీవితాలను సరిజేసుకొని మీ పొరుగువారికి కూడా అందించి ఆనందించాలని ఈ పుస్తక రూపములో వెలువరించుట జరిగింది.