విలాప వాక్యములు విలాప వాక్యములు

విలాప వాక్యముల‪ు‬

Publisher Description

ప్రియ పాఠకులారా! మన జీవితములో విలపించు సందర్భాలు లేనివారంటూ వుండరు. ఏదో ఒక సందర్భములో భరింపరాని బాధ కలుగుట జరుగును. ఆ బాధ హృదయమును పిండగా, మన మనస్సు వికలమై పరిపరివిధాలుగా ఆలోచిస్తూ విలపించుట జరుగును. కొందరి జీవితాలలో విలపించుట కొన్ని సందర్భాలలో జరిగితే మరి కొందరి జీవితాలలో అనేక సందర్భాలలో విలపించుట జరుగును. మరికొందరి జీవితమే విలపించుటతోనే సరిపోతుంది. ఈ విలపించుటలో మన జీవితమే కోల్పోయిన బాధ వుంటుంది. ఈ బాధ వర్ణించుట అసాధ్యమే. కాని ఆయా సందర్భాలను ఊహించుట ద్వారా అర్థం చేసుకోవచ్చు.
మనకు దీనిని అర్థం చేసుకొనవలసిన అవసరత వుందా? అన్న సంశయము కలుగును. విలపించువారు ఎందుకు విలపిస్తున్నారు, దానికి గల కారణము ఏమైయుండునని పరిశీలిస్తే అలాంటి కారణమునకు మనము గురికాకుండా తప్పించుకొను అవకాశము వుంటుంది. ఈ పుస్తకములో బైబిలు గ్రంథములోని బాబిలోని దాస్యము అను కాడి క్రింద ఇశ్రాయేలీయులు చేసిన పాపము నిమిత్తము వారు పొందిన శ్రమ దానికి కారణమైన దేవుని ఉగ్రత, వారు అనుభవించిన వినాశనము దానివలన వారికి కలిగిన విలాపమును ఈ విలాపవాక్యములు అను గ్రంథముగా వ్రాయుట జరిగింది. దానిని బైబిలు గ్రంథములో ప్రాధాన్యతను ఇచ్చి రచించారు అంటే దేవుని ఉద్దేశ్యములో దీనిని గూర్చి అందరు తెలుసుకొనవలెననేకదా! ఇలా వుంచుటలో దేవుని ఉద్దేశ్యము ఆయన మనకు ఈ గ్రంథకర్త రచన ద్వారా మనకు ఏమి చెప్పాలనుకొన్నారో చదివి గ్రహించి తదనుగుణముగా జీవించువారు ధన్యులే.

GENRE
Religion & Spirituality
RELEASED
2017
24 July
LANGUAGE
TE
Telugu
LENGTH
186
Pages
PUBLISHER
Www.FaithScope.com
SELLER
Vasa Reddy
SIZE
2
MB
జేసునాధుని దివ్య వాక్కులు జేసునాధుని దివ్య వాక్కులు
2020
ఏదెనులోని దైవ ప్రణాళిక ఏదెనులోని దైవ ప్రణాళిక
2017
పండుగలు, ఉత్సవాలు, ఊరేగింపులు, మ్రొక్కుబడులు పండుగలు, ఉత్సవాలు, ఊరేగింపులు, మ్రొక్కుబడులు
2017
మోషే ధర్మశాస్త్రము – క్రీస్తు ధర్మశాస్త్రము (Telugu) మోషే ధర్మశాస్త్రము – క్రీస్తు ధర్మశాస్త్రము (Telugu)
2017
ఏడు సంఖ్యలోని సర్వ సంపూర్ణత ఏడు సంఖ్యలోని సర్వ సంపూర్ణత
2017
కీర్తనలు కీర్తనలు
2017